సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో కరోనాతో ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. అంతకంతకూ విస్తరిస్తోన్న మహమ్మారి.. నేడు ఈ కేంద్ర బలగాలకు చెందిన మరో 41 మందికి సోకింది. దీంతో బీఎస్ఎఫ్ దళంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. ఇద్దరు జవాన్లు వైరస్ నుంచి కోలుకున్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది మృతి.. కొత్తగా 41 కేసులు - BSF Corona news
సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో కొవిడ్ ధాటికి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఈ కేంద్ర బలగాలకు చెందిన మరో 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది మృతి.. కొత్తగా 41 కేసులు
కరోనా మృతుల్లో బీఎస్ఎఫ్లో ఇదే మొదటికేసు కాగా.. పారామిలిటరీ దళాల్లో రెండోది. సీఆర్పీఎఫ్లోని 55 ఏళ్ల ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇటీవల మృతిచెందాడు.
ఇదీ చదవండి:ఆపరేషన్ సముద్ర సేతు: మాల్దీవులకు 'ఐఎన్ఎస్ జలాశ్వ'