తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​-బంగ్లా సంబంధాల్లో చారిత్రక ఘట్టం' - mea news

కోల్​కతా నుంచి బంగ్లాదేశ్​లోని ఛత్తోగ్రామ్​ ఓడరేవు మీదుగా తొలి కంటైనర్ కార్గో అగర్తల చేరకుందని వెల్లడించారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. భారత్​-బంగ్లాదేశ్​ మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు.

1st ever container cargo from Kolkata via Chattogram port reaches Agartala: MEA
భారత్​-బంగ్లా సంబంధాల్లో చారిత్రక ఘట్టం

By

Published : Jul 23, 2020, 7:00 PM IST

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య అనుసంధానత, ఆర్థిక భాగస్వామ్యంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందని ట్విట్టర్ వేదికగా తెలిపారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. కోల్​కతా నుంచి కొద్ది రోజుల క్రితం బయలు దేరిన తొలి కంటైనర్​ కార్గో.. బంగ్లాదేశ్​ ఛత్తోగ్రామ్ ఓడరేవు మీదుగా అగర్తల చేరుకున్నట్లు వెల్లడించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఈ సంబంధాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కంటైనర్​ కార్గోను గతవారం జెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి మన్​సుఖ్​ మాండవియా.

భారత్​-బంగ్లాదేశ్ ఇటీవలి కాలంలో నౌకావ్యాపారంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు 6 ఓడరేవుల్లో వ్యాపారాలు కొనసాగించగా.. గతవారం నుంచి మరో ఐదు నౌకాశ్రయాలకు వీటిని విస్తరించాయి. రెండు దేశాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు క్రూజ్​ సేవలను కూడా గతవారం నుంచే ప్రారంభించాయి.

ఇదీ చూడండి: హ్యామర్​ క్షిపణితో రఫేల్​కు మరింత శక్తి!

ABOUT THE AUTHOR

...view details