తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సజ్జన్​ పిటిషన్​పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ​ నేత సజ్జన్​ కుమార్​ పిటిషన్ విచారణపై స్పందన తెలపాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. సజ్జన్​ బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 15న వాదనలు విననుంది.

By

Published : Apr 8, 2019, 3:04 PM IST

Updated : Apr 8, 2019, 6:07 PM IST

సజ్జన్​ పిటిషన్​పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం

సజ్జన్​ పిటిషన్​పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్​ కుమార్​ బెయిల్ పిటిషన్ విచారణపై వివరాలు తెలపాలని సీబీఐ స్పందన కోరింది సుప్రీంకోర్టు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్​ కుమార్​కు దిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్​ 17న జీవిత ఖైదు విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు సజ్జన్​. ఈ బెయిల్​​ పిటిషన్​పై ఈ నెల 15న వాదనలు విననుంది సర్వోన్నత న్యాయస్థానం.

1984 దిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో అప్పటి సిట్టింగ్​ ఎంపీ సజ్జన్​ కుమార్​ది ప్రముఖపాత్ర అని కోర్టుకు తెలిపింది సీబీఐ.

"సిక్కుల ఊచకోత మహానేరం. సజ్జన్​ కుమార్​కు బెయిల్​ మంజూరు చేస్తే... అది న్యాయవ్యవస్థకే అవమానం. ఆయన దిల్లీ పటియాలా హౌస్​ కోర్టులో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు​."
- తుషార్​ మెహతా, సీబీఐ అధికారి

ఇందిరాగాంధీ హత్యతో అల్లర్లు

1984 అక్టోబర్​ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు 'సిక్కు' అంగరక్షకులు హత్య చేశారు. ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా దిల్లీలో నవంబర్​ 1, 2 తేదీల్లో పెద్ద ఎత్తున సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఈ మారణహోమంలో వందలాది మంది సిక్కులు చనిపోయినట్లు దిల్లీ హైకోర్టు పేర్కొంది.

Last Updated : Apr 8, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details