తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముహూర్తం అదిరింది.. 186 జంటలకు ఒకేసారి పెళ్లయింది! - guruvayur

ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలేమీ జరగట్లేదు కానీ జనాల రద్దీ మాత్రం ఊహించని స్థాయికి చేరింది. కారణమేంటబ్బా అనుకుంటున్నారా? ముహూర్త బలమండీ! మంచి ముహూర్తం మించినా దొరకదని.. ఆ గుళ్లో ఒకే రోజు 186 పెళ్లిళ్లు జరిగాయి. 689 మంది బుజ్జి పాపాయిలకు అన్నప్రాసనలు అయ్యాయి.

ముహూర్తం అదిరింది.. 186 జంటలకు ఒకేసారి పెళ్లయింది!

By

Published : Aug 26, 2019, 3:14 PM IST

Updated : Sep 28, 2019, 8:02 AM IST

ముహూర్తం అదిరింది.. 186 జంటలకు ఒకేసారి పెళ్లయింది!
కేరళ త్రిస్సూర్​లోని గురువాయూర్​ దేవాలయంలో ఆదివారం విపరీతమైన రద్దీ నెలకొంది. అయితే అక్కడకు విచ్చేసినవారు కేవలం స్వామి వారి దర్శనార్థం రాలేదు. ఒకటిగా వచ్చి జంటగా వెళ్లేందుకు కొందరు, మరికొందరు తమ ఇంటి సిసింద్రీలకు అన్నప్రాసన జరిపించేందుకు బారులుతీరారు.

మలయాళ క్యాలెండర్​ ప్రకారం ఈ నెల 17న వారికి నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల చింగం మాసం వారి జీవితాలకూ శుభారంభంగా భావిస్తారు మలయాళీలు. ఈ నెలలో శుభ ముహూర్తాన మూడు ముళ్లు వేస్తే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని ఇక్కడివారి నమ్మిక .

ఆదివారం మంచి ముహూర్తాన్ని మిస్​ కాకూడదని, గుడి తెరవకముందే మూడు కళ్యాణ మండపాల్లో జనాలు నిండిపోయారు. ఆ ప్రాంగణమంతా పెళ్లి బాజాలతో మారుమోగింది. ఒక్కరోజునే గురువాయూర్​ గుడిలో 186 జంటలు ఒక్కటయ్యాయి. 689 మంది చిన్నారులకు 'చోరునూ'... అంటే అన్నప్రాసన జరిపించారు.

దాదాపు వెయ్యి వేడుకలు జరుగుతున్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువుల సంఖ్య ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక వారి వాహనాల వల్ల ఏర్పడ్డ ట్రాఫిక్​ ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.

ఇదీ చూడండి:సీఎం కాన్వాయ్​ని బైక్​తో ఢీకొట్టిన యువకుడు

Last Updated : Sep 28, 2019, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details