తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో డాక్టర్ల సమ్మె.. వైద్యసేవలు బంద్​ - జీతాలు పెంచాలని రోడ్డెక్కిన తమిళ వైద్యులు

తమిళనాడువ్యాప్తంగా 18 వేల మంది వైద్యులు నిరవధిక సమ్మెకు దిగి 24 గంటలు గడిచిపోయింది. మరోవైపు ఆసుపత్రుల్లో వందలాది మంది రోగులు వైద్యం లేక అలమటిస్తున్నారు.

సమ్మె: జీతాలు పెంచాలని రోడ్డెక్కిన తమిళ వైద్యులు

By

Published : Oct 26, 2019, 1:42 PM IST

Updated : Oct 26, 2019, 4:53 PM IST

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సమాఖ్య నిరవధిక సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. సరైన జీతాలు, పదోన్నతులు డిమాండ్​ చేస్తూ.. దాదాపు 18 వేల మంది వైద్యులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రోడ్డెక్కారు. అత్యవసర సేవలు మినహాయించి... మిగతా వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిపివేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే చేరిన రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య సేవలు అందక ఔట్​పేషెంట్​ వార్డుల్లో వందలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా... ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను శాంతి పరిచే ప్రయత్నాలేవీ చేయలేదు.

వైద్యుల డిమాండ్లివే..

  • పీజీ అడ్మిషన్లలో సర్వీస్​ కోటా కింద 50% రిజర్వేషన్లు కావాలి.
  • రోగుల సంఖ్యను బట్టి వైద్యుల నియామకాలు జరిపించాలి.
  • జీతాల పెంపు, పదోన్నతులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి.

ఇదీ చూడండి:నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది

Last Updated : Oct 26, 2019, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details