తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం(జూన్ 16న) రాత్రి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారికి లేహ్‌లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందులో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం వారు చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
50 మందికి స్వల్ప గాయాలు..
స్వల్పంగా గాయపడిన మరో 50 మంది జవాన్లకు చికిత్స అందించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు ఆర్మీ అధికారులు. వారంతా రెండు వారాల్లో విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.