తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ నుంచి వచ్చిన ఆ 18 మందికి భారత పౌరసత్వం - indian citizenship act-1955

అది రాజస్థాన్​లోని జైపుర్ కలెక్టర్​ కార్యాలయ ఆడిటోరియం. అక్కడ నిల్చొని ఉన్న 18 మంది మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ శుక్రవారం వారికి మరచిపోని అనుభూతిని మిగిల్చింది. కారణం.. ఇన్నాళ్లూ వలసదారులుగా ఉన్నవారంతా భారతీయ పౌరసత్వం అందుకున్నారు.

18 pak nationals got indian citizenship in jaipur
ఆ 18 మందికి భారత పౌరసత్వం

By

Published : Dec 19, 2020, 11:50 AM IST

పాకిస్థాన్​ నుంచి వలస వచ్చి రాజస్థాన్​లో స్థిరపడిన కొందరికి భారత పౌరసత్వ సవరణ చట్టం-1955 ప్రకారం నేడు భారత పౌరులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌరసత్వం అందుకున్న వెంటనే అక్కడ వందేమాతరం, హిందుస్థాన్​ జిందాబాద్​ నినాదాలు మారుమోగాయి. భారత పౌరసత్వం లేక అనేక ఏళ్లుగా వారంతా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. రాజస్థాన్​లోని జైపుర్​ పాలనాధికారి చేతులమీదుగా భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్లు చెమర్చాయి.

''ఇక్కడికి కలెక్టర్​గా బదిలీపై వచ్చినప్పుడు నిమితేకం సంస్థ ప్రతినిధులు నాకీ సమస్య గురించి వివరించారు. నా పై అధికారులు సైతం పాకిస్థాన్​ నుంచి వలస వచ్చిన పౌరులకు భారత పౌరసత్వాన్నిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పాకిస్థాన్​ నుంచి వలస వచ్చిన మిగిలిన పౌరులకు సైతం త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా.

--- అంతర్ సింగ్​​ నెహ్రా, జైపుర్​ కలెక్టర్.​

అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనర్హులుగా తేలినవారిని తిరిగి పంపిస్తామని కలెక్టర్​ అన్నారు. 2009కి ముందు దరఖాస్తు చేసుకున్న వారందరికీ.. పాత చట్టానికి అనుగుణంగా పౌరసత్వం కల్పించాలని నిమితేకం సంస్థ అధ్యక్షుడు జై అహుజా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వీరంతా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details