75 ఏళ్ల ఫక్కడ్ బాబా... ఉత్తరప్రదేశ్ మధుర లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు... ఇందులో విశిష్టత ఏముందనుకుంటున్నారా? ఇంతకుముందు 16 సార్లు విధానసభ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. అన్నింటా ఘోరపరాజయాన్ని చవిచూశారు. ఈసారీ ఓడిపోతానని.. కానీ, 20వ సారి గెలువు ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు తన గురువు నిశ్చలానంద స్వామి ఆదేశించినట్లు తెలిపారు బాబా.
గురువు చెప్పిన వాటిని పాటించటం మన భారతీయ సంస్కృతి. గురువే నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఎన్ని ఆపదలు, కష్టాలు ఉన్నప్పటికీ గురువు ఆజ్ఞ మేరకు 20 ఎన్నికల్లో పోటీ చేస్తా.
- ఫక్కడ్ బాబా, మధుర ఎంపీ అభ్యర్థి