తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో 157, జైపూర్​లో 68 మందికి కరోనా నెగటివ్​

ఇరాన్​లో చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు విదేశాంగశాఖ తెలిపింది. రేపటి నుంచి ఇరాన్​-భారత్​ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. మరోవైపు జైపూర్​లో ఇటలీ దేశస్థులతో సన్నిహితంగా మెలిగిన వారిలో 68 మందికి కరోనా నెగటివ్​గా వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

175 in Uttar Pradesh, 68 members in Jaipur tested corona negative
ఉత్తర్​ప్రదేశ్​లో 175, జైపూర్​లో 68 మందికి కరోనా నెగటివ్​

By

Published : Mar 5, 2020, 11:31 PM IST

Updated : Mar 5, 2020, 11:52 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న తరుణంలో రాజస్థాన్​ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకునే వార్తను అందించారు అధికారులు. కరోనా సోకిన ఇటలీ దేశస్థులతో జైపూర్​లో సన్నిహితంగా మెలిగిన 68 మందికి కరోనా నెగటివ్​గా వచ్చినట్లు ప్రకటించారు. మరో 8 మంది వైద్య పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉందన్నారు. అటు ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇప్పటి వరకు 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి జై ప్రతాప్​ సింగ్​ తెలిపారు. అందులోని 157 మందికి కొవిడ్​ లక్షణాలేమీ కనిపించలేదన్నారు. ముందు జాగ్రత్తగా 820 ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పేటీఎం కార్యాలయం మూసివేత

తమ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా వచ్చినందున గుర్​గావ్​లోని సంస్థ కార్యాలయాన్ని 15 రోజులపాటు మూసేసింది పేటీఎం.

భారత్​-ఇరాన్ మధ్య ప్రత్యేక విమానాలు​

ఇరాన్​లో చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విదేశాంగశాఖ తెలిపింది. రేపటి నుంచి ఇరాన్​-భారత్​ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. భారత్​లోని తమ దేశస్థుల కోసం ఇరాన్ ప్రభుత్వం రేపు విమానాన్ని దిల్లీకి పంపనున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటించారు. అలాగే ఇటలీ, దక్షిణ కొరియా దేశాల నుంచి భారత్​లోకి అడుగుపెట్టే వారికి కరోనా నెగటివ్​గా వచ్చినట్లు చూపే వైద్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్​ సర్టిఫికేట్​) వెంట తీసుకురావాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

ఎయిర్​పోర్టులో కేంద్రమంత్రి తనిఖీ

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు చేస్తున్న కరోనా పరీక్షలను తనిఖీ చేశారు కేంద్ర ఆరోగ్యాశాఖ మంత్రి హర్షవర్ధన్​

మొఘల్​ గార్డెన్స్ బంద్​

ప్రజలతో నిత్యం కిటకిటలాడే దిల్లీ రాష్ట్రపతి భవన్​లోని మొఘల్​ గార్డెన్స్​ను ఈ శనివారం నుంచి మూసేస్తున్నట్లు తెలిపారు అధికారులు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. షెడ్యూల్​ ప్రకారం ఆదివారం మూసేవేయాల్సి ఉండగా కరోనా భయాలతో ఒకరోజు ముందుగానే సందర్శలకు అనుమతి నిరాకరించనున్నారు. అలాగే హోలీ ఉత్సవాలకు కూడా రాష్ట్రపతి దూరంగా ఉంటారని ఇదివరకే స్పష్టం చేశారు అధికారులు.

Last Updated : Mar 5, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details