తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాకు ఎంతమంది వైద్యారోగ్య సిబ్బంది బలయ్యారంటే!

కొవిడ్​కు బలైన వైద్య, ఆరోగ్య సిబ్బంది వివరాలను లోక్​సభలో శుక్రవారం కేంద్రం వెల్లడించింది. వైద్య, ఆరోగ్య సహాయక మంత్రి అశ్వినీ చౌబే ఈ వివరాలను తెలిపారు. మొత్తం 174 డాక్టర్లు, 116 నర్సులు, 199 ఆరోగ్య సిబ్బంది మృతి చెందారన్నారు.

COVID-19, healthcare workers, ashwini choubey
వైద్యారోగ్య సిబ్బంది మృతుల సంఖ్యను వెల్లడించిన కేంద్రం

By

Published : Feb 5, 2021, 9:45 PM IST

కొవిడ్​ కారణంగా మృతిచెందిన వైద్య, ఆరోగ్య సిబ్బంది వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. లోక్​సభలో ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారుకేంద్ర వైద్యారోగ్య సహాయక మంత్రి అశ్వినీ చౌబే. ఫిబ్రవరి 2 నాటికి మొత్తం 174 డాక్టర్లు, 116 నర్సులు, 199 ఆరోగ్య సిబ్బంది మహమ్మారి కారణంగా మృతి చెందారని పేర్కొన్నారు.​ రాష్ట్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వివరించారు.

10 లక్షల్లో 111 మంది..

పది లక్షల్లో 111 మంది కొవిడ్​ కారణంగా మృతి చెందుతున్నారని, అదే విధంగా 10 లక్షల్లో 7,719 మంది వైరస్​ బారిన పడుతున్నారని చౌబే తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది సంఖ్యపై స్పందిస్తూ ఆరోగ్య శాఖ అటువంటి వివరాలు నమోదు చేయట్లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'మన టీకాల కోసం 22 దేశాల నుంచి అభ్యర్థనలు'

ABOUT THE AUTHOR

...view details