దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యధిక కేసులు నమోదయిన నేపథ్యంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్రప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలిచాయి.
'మహా'లో 10 వేలకు చేరువలో..
మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 597 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో 9,915 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 32 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 432కు చేరింది.
గుజరాత్లో 4 వేలకు పైగా..
గుజరాత్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 308 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,082 చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 197 మంది వైరస్‌కు బలయ్యారు. 527 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని సమాచారం.
మధ్యప్రదేశ్‌లో మరో 173 కేసులు...
మధ్యప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. నేడు కొత్తగా 173 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 2,560 మంది వైరస్ బారినపడ్డారు. మరో 10 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 130కి పెరిగింది. 461 మందిలో వైరస్ నయమైంది.
తమిళనాడులో 100 పైగా నూతన కేసులు..
తమిళనాడులో గత 24 గంటల్లో 104 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,162 చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,168 మంది కోలుకున్నట్లు చెప్పారు. మొత్తంగా 27 మంది మహమ్మారికి బలయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో...