దక్షిణ త్రిపుర సంతిర్బజార్లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి 17 ఏళ్ల యువతిని కట్నం కోసం సజీవ దహనం చేశాడో కిరాతకుడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలైన ఆ యువతిని జీపీ పంత్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
అజయ్ రుద్ర పాల్(21), అతని తల్లి మినాతీతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు పోలీసులు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని జిల్లా స్థానిక కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసు అధికారి నారాయణ్ చంద్ర.
''అక్టోబర్ 28న పాల్.. కోవాయీకి చెందిన శుక్లా చౌధురీతో కలిసి పారిపోయాడు. డిసెంబర్ 11న లాంఛనంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. ఇందుకోసం... ఇంటికి వెళ్లి రూ. 50 వేలు కట్నం తీసుకురావాలని వేధించాడు.''
- నారాయణ్ చంద్ర సాహా, పోలీసు అధికారి