తమిళనాడులో 17 పురాతన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. పుదుకొట్టై జిల్లా కేంద్రం సమీపంలోని పెరయూర్ గ్రామంలో సుబ్బన్ అనే వ్యక్తి కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇటుక బట్టీ పెట్టుకోవాలని నేలను చదును చేస్తున్నాడు. చెట్లను జేసీబీ సాయంతో తొలగిస్తుండగా ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి. వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాడు సుబ్బయ్య. అధికారులు ఈ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు: విలువైన పురాతన విగ్రహాలు లభ్యం - తమిళనాడు
తమిళనాడులో పురావస్తు పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. పెరయూర్ గ్రామంలో ఇటుకబట్టీ పెట్టుకునేందుకు ఓ వ్యాపారి నేలను చదును చేస్తుండగా ఏకంగా 17 విగ్రహాలు లభ్యమయ్యాయి.
తమిళనాడు: బైటపడ్డ విలువైన పురాతన విగ్రహాలు
ఈ పంచలోహ విగ్రహాలతోపాటు మరికొన్ని విలువైన విగ్రహాలు అక్కడ లభించాయి. మొత్తం 21 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. వీటి కాలంతో పాటు విలువను అంచనా వేయడానికి పురావస్తు శాఖకు అందజేస్తామన్నారు.
ఇదీ చూడండి : 'జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకోవాలి'
Last Updated : Jun 19, 2019, 6:08 PM IST