తెలంగాణ

telangana

ETV Bharat / bharat

17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్​ నివేదిక

సార్వత్రిక ఎన్నికల తొలిదశలో పోటీ చేస్తున్న 1266 మందిలో 17 శాతం మంది క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని 'అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రిఫామ్స్​​ ' నివేదిక స్పష్టం చేస్తోంది.

By

Published : Apr 6, 2019, 10:40 AM IST

Updated : Apr 6, 2019, 12:03 PM IST

17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్​ నివేదిక

17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్​ నివేదిక

సార్వత్రిక ఎన్నికల తొలి దశలో పోటీచేస్తున్న అభ్యుర్థుల్లో 17శాతం మంది నేరచరితులేనని తేలింది. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు సమర్పించిన ప్రమాణపత్రాల ఆధారంగా అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​ ఈ విషయం వెల్లడించింది.

తొలి దశలో 12 వందల 79మంది పోటీచేస్తున్నారు. ఇందులో 12వందల 66 మంది ఈసీకి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్​ అధ్యయనం చేసింది.

ఏడీఆర్​ నివేదిక

ఏడీఆర్ ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఓ ఎన్​జీఓ, ప్రజావేగు. ఈ నివేదిక వివరాలు..

* లోక్​సభ తొలిదశ ఎన్నికల్లో పోటీచేస్తున్న 1266 మందిలో 17 శాతం క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు.

* ఒక కోటి లేదా అంతకు మించి ఆస్తులున్న అభ్యర్థులు 32 శాతం

* జాతీయ పార్టీలు ముందంజలో ఉన్నాయి. భాజపా 36 శాతం మంది నేర చరితులకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్​ అభ్యర్థుల్లో 42 శాతం మందిపై కేసులున్నాయి.

* భాజపా అభ్యర్థుల్లో 19 శాతం మంది, కాంగ్రెస్​ అభ్యర్థుల్లో 27 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.

* తొలిదశ ఎన్నికలు జరగనున్న 91 లోక్​సభ స్థానాల్లో 37 'రెడ్​ అలర్ట్​ నియోజకవర్గాలు'గా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అంతకు మించిన అభ్యర్థులు తీవ్ర నేరచరిత్ర కలిగిన వారని తెలిపింది.

Last Updated : Apr 6, 2019, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details