నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. అర్ఘఖచి జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి కొండ మీద నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది.
లోయలో పడ్డ బస్సు - 17 మంది మృతి - latest national news
నేపాల్ అర్ఘఖచి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడటం వల్ల 17 మంది మరణించారు. పదిమంది క్షతగాత్రులయ్యారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
బస్సు లోయలో పడి 17మంది మృతి..ముగ్గురు గల్లంతు
రుపాన్దేహి జిల్లాలోని కొండ ప్రాంతం వద్ద మలుపులు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడింది.
ఇదీ చూడండి : గాడ్సే దేశభక్తుడంటూ.. మరోమారు నోరుజారిన ప్రగ్యా సింగ్!
Last Updated : Nov 28, 2019, 7:27 AM IST