తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హడావుడి' చట్టాలపై వెంకయ్యకు విపక్షాల లేఖ

పార్లమెంటరీ స్థాయీ సంఘాలు లేదా ఎంపిక కమిటీల పరిశీలనకు పంపకుండా మోదీ ప్రభుత్వం బిల్లులను హడావుడిగా ఆమోదింపచేయడానికి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు 14 విపక్ష పార్టీలు లేఖ రాశాయి. ఆయన స్వయంగా కలుగజేసుకోవాలని అభ్యర్థించాయి.

By

Published : Jul 26, 2019, 4:34 PM IST

'హడావుడి' చట్టాలపై వెంకయ్యకు విపక్షాల లేఖ

పార్లమెంట్​లో ఎలాంటి 'పరిశీలన' చేపట్టకుండానే 'హడావుడి'గా బిల్లులు ఆమోదిస్తుండడంపై నిరసన వ్యక్తం చేస్తూ 17 విపక్ష పార్టీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకి లేఖ రాశాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరాయి.

"పార్లమెంటరీ స్థాయీ సంఘం లేదా ఎంపిక కమిటీల పరిశీలన లేకుండానే కేంద్రప్రభుత్వం హడావుడిగా పార్లమెంటులో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనిపై మేము ఎంతో ఆవేదన, ఆందోళన చెందుతున్నాము. ఇలా చేయడం సంప్రదాయం నుంచి పక్కకు తప్పుకోవడమే అవుతుంది"
- విపక్ష పార్టీల లేఖ

'హడావుడి' చట్టాలపై వెంకయ్యకు విపక్షాల లేఖ

'పరిశీలన' లేకుండానే...

14వ లోక్​సభలో 60 శాతం, 15వ లోక్​సభలో 71 శాతం, 16వ లోక్​సభలో 26 శాతం బిల్లులు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు వెళ్లాయని విపక్షాలు గుర్తుచేశాయి. కానీ 17వ లోక్​సభ కాలంలో మాత్రం ఇప్పటి వరకు 14 బిల్లులు పార్లమెంటరీ కమిటీల పరిశీలన లేకుండానే ఆమోదించారని ఆవేదన వ్యక్తంచేశాయి.

"ప్రజా సంప్రదింపులు చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. పార్లమెంటరీ కమిటీలు బిల్లులను పరిశీలించి, అందులోని లోపాలను సవరించి, నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తాయి."
-విపక్ష పార్టీల లేఖ

రాజ్యసభ ఛైర్మన్​కు లేఖ రాసిన పార్టీల్లో.... కాంగ్రెస్, సమాజ్​వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్​ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్​, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం ఉన్నాయి.

ఇదీ చూడండి: పులిని కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు..!

ABOUT THE AUTHOR

...view details