తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మారుతీ సిబ్బందికి కరోనా- క్వారంటైన్ నుంచి మాయం - maruti manesar plant

హరియాణాలోని మారుతీ సుజుకీ ప్లాంట్​లో పనిచేసే సిబ్బందికి కరోనా సోకింది. అయితే వైరస్ నిర్ధరణ అయిన అనంతరం వారు క్వారంటైన్ నుంచి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

maruti
మారుతీ సిబ్బందికి కరోనా- క్వారంటైన్ నుంచి అదృశ్యం

By

Published : Jun 23, 2020, 7:22 PM IST

కరోనా సోకిన 17 మంది మారుతీ సుజుకీ ప్లాంట్ సిబ్బంది అదృశ్యం కలకలం రేపుతోంది. హరియాణా మనేసర్ ప్లాంట్​లో పని చేసే వీరంతా ఎస్​ఐఎస్​ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వారు. అదృశ్యమైన ఉద్యోగులు, వారి మేనేజర్​పై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

మారుతీ ప్లాంట్​లో పనిచేస్తున్న సిబ్బందికి జూన్​ 17న స్థానిక పీహెచ్​సీలో కరోనా పరీక్షలు చేయగా.. 17 మందికి పాజిటివ్​గా తేలింది. ఈ విషయమై వారి మేనేజర్​కు సమాచారమిచ్చారు. వారంతా క్వారంటైన్​లో ఉన్నారని ఆ మేనేజర్ ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపారు. అయితే జూన్ 18న ప్లాంట్​ వద్దకు వచ్చిన ఆరోగ్య శాఖ సిబ్బంది... రోగులు అదృశ్యమైనట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

'మా ఉద్యోగులు కాదు'

తమ ప్లాంట్​లో కరోనా అనుమానితులుగా గుర్తించినవారు తమ ఉద్యోగులు కాదని.. వారంతా ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేసేవారని చెప్పారు మారుతి సుజుకీ అధికార ప్రతినిధి. అయితే కరోనా అనుమానిత సెక్యూరిటీ సిబ్బంది ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై పడిందా అనే అంశమై స్పష్టత ఇవ్వలేదు సంస్థ.

50 రోజుల లాక్​డౌన్ అనంతరం మే నెలలో మనేసర్ ప్లాంట్​లో కార్యకలాపాలను పునఃప్రారంభించారు.

ఇదీ చూడండి:'కరోనిల్​' సేఫేనా? క్లినికల్​ ట్రయల్స్ రిజల్ట్ ఏంటి?

ABOUT THE AUTHOR

...view details