అయోధ్య రామమందిర భూమిపూజను 16.3కోట్ల మంది వీక్షించారని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం 198 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని తెలిపింది.
ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగిన భూమిపూజ కార్యక్రమం.. మొత్తం 730 కోట్ల వీక్షణ నిమిషాలను నమోదు చేసినట్లు బార్క్ చెబుతోంది. ఇటీవలి కాలంలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.
అయోధ్య టాప్..
పంద్రాగస్టున ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం 464 కోట్లు, కరోనాపై ఐదోసారి మే 12న ఇచ్చిన సందేశానికి 425 కోట్ల వీక్షణలు నమోదైనట్లు బార్క్ తెలిపింది. అయితే భూమిపూజకు అత్యధిక వీక్షణలు రావటానికి కారణం.. కార్యక్రమం నిడివి(207 నిమిషాలు) కావచ్చని బార్క్ చీఫ్ సునిల్ లుల్లా అభిప్రాయపడ్డారు.
ప్రైమ్‌టైమ్ న్యూస్..