హాథ్రస్ ఘటనతో దేశమంతా ఆగ్రహ జ్వాలలతో నిండిపోగా.. కొత్త దారుణాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్ చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది.
అసలేం జరిగింది?
సెప్టెంబర్ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు.. తనను జీపులో వచ్చి అపహరించాడు. జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.