తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదో తరగతి విద్యార్థి హత్య.. చంపింది స్నేహితులే! - పదో తరగతి విద్యార్థి హత్య

పదో తరగతి విద్యార్థి హత్యకు గురైన సంఘటన కేరళ కొడుమోన్​ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

16-year-old boy brutally hacked to death in Pathanamthitta; 2 classmates in custody
పదో తరగతి విద్యార్థి హత్య.. ఎందుకు చేశారంటే..?

By

Published : Apr 22, 2020, 12:59 PM IST

Updated : Apr 22, 2020, 2:37 PM IST

కేరళ కొడుమోన్​ ప్రాంతంలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులే హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బాధితుడు అంగడికల్​ ప్రాంతానికి చెందిన నిఖిల్(16)​గా గుర్తించారు పోలీసులు. నిఖిల్​ను తోటి విద్యార్థులు ఇద్దరు కలిసి.. పాఠశాల పరిసర ప్రాంతంలో హత్య చేశారు. వెంటనే శవాన్ని అదే ప్రాంతంలో పూడ్చిపెడుతుండగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. నిఖిల్​ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Apr 22, 2020, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details