రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న విపక్షాలు! - సాగుచట్టాలపై విపక్షాలు
13:49 January 28
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!
పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి శుక్రవారం చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. సాగు చట్టాలను బలవంతంగా ఆమోదించడానికి నిరసనగా ఇలా చేస్తున్నట్లు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో కేంద్రం పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఓ రైతు మృతి చెందగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.