ఆర్టికల్ 370, అధికరణ 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో తాజా పరిస్థితులను వివరించేందుకు 16 దేశాల ప్రతినిధులను నేడు పర్యటనకు తీసుకెళ్లనున్నారు అధికారులు. వీరిలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు.
కశ్మీర్లో పర్యటించి.. స్థానికుల ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు విదేశీ ప్రతినిధులు. భద్రతకు సంబంధించిన విషయాలను అధికారులు వారికి వివరించనున్నారు.
ఈ పర్యటనలో పొరుగు దేశం పాకిస్థాన్.. కశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని భద్రతా దళాలు వివరించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ముతో విదేశీ ప్రతినిధుల బృందం భేటీ కానున్నట్లు వెల్లడించారు.