అరుదైన శిల్పకళకు సాక్ష్యంగా నిలిచింది అలహాబాద్ మ్యూజియం. 1500 ఏళ్లనాటి సీత, లక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాన్ని ఇక్కడ భద్రపరిచారు పురావస్తుశాఖ అధికారులు. రావణ వధ అనంతరం అయోధ్యకు విచ్చేసిన సందర్భాన్ని ఈ విగ్రహం గుర్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
శృంగావర్పుర్లో జరిపిన తవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడింది. కార్బన్ డేటింగ్ ఆధారంగా ఈ విగ్రహాన్ని.. గుప్తుల కాలానికి చెందినట్లుగా అధికారులు అంచనా వేశారు. లక్ష్మణ, సీతా సమేతంగా అభయముద్రలో శ్రీరాముడు ఉన్నాడు. ఆంజనేయుడు కూడా అభయముద్రలోనే ఉన్నాడు.