తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు.. ఎక్కడివి?

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో రహదారి పక్కన గడువు చెల్లిన కండోమ్​లను పడేశారు. అయితే.. 15 లారీల నిండా కండోమ్​లు ఉండటం స్థానికుల ఆగ్రహావేశాలకు కారణమైంది. వీటిని లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు చెల్లిన కండోమ్​లుగా గుర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు
రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు

By

Published : Dec 28, 2019, 11:51 AM IST

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లోని సోహరామావ్​లో ఓ మూసేసిన ఇటుక బట్టీకి కొన్ని లారీలు వచ్చాయి. అందులోనున్న లోడ్​ను త్వరత్వరగా దించేస్తున్నారు. ఇదంతా గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి చూసి అవాక్కయ్యారు. తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకో తెలుసా..?ఇంతకీ అందులో ఏమున్నాయో తెలుసా..?ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే కండోమ్​లు. అవును. అన్నీ గడువు పూర్తయినవి. ఈ విషయంపై లారీ డ్రైవర్లను స్థానికులు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇవి లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రికి చెందినవని.. తమను అడ్డుకోవద్దని చెప్పారు డ్రైవర్లు.

అక్కడికి మరింత మంది గ్రామస్థులు వస్తుండటం చూసి డ్రైవర్లు వీలైనంతగా లోడ్​ను దించేసి అక్కడి నుంచి పరారయ్యారు.

అసలేం జరిగింది..

లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు తీరిన కండోమ్​లు భారీ స్థాయిలో నిల్వ ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు లఖ్​నవూ నగర పాలక సంస్థ నిరాకరించింది. ఫలితంగా ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోహరామావ్​లోని ఈ బట్టీని ఎంపిక చేసుకున్నాయి.

గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖను సంప్రదిస్తామని, దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details