తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం- 9 మంది మృతి - మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం

15-killed-in-bus-truck-collision-in-mps-rewa
మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం- 15 మంది మృతి

By

Published : Dec 5, 2019, 8:47 AM IST

Updated : Dec 5, 2019, 10:41 AM IST

09:53 December 05

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి అతివేగంతో ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల  9 మంది మృతి చెందారు. రీవా నుంచి సిధి జిల్లాకు బస్సు ప్రయాణిస్తుండగా గుద్​ రోడ్డు సమీపంలో ఉదయం 6.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

బస్సు ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులంతా సీట్ల మధ్య ఇరుక్కుపోయి చనిపోయారు. ప్రైవేటు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

08:42 December 05

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం- 9 మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్​ రీవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్​ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరి కొంతమంది బస్సులోనే ఇరుక్కున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 5, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details