జమ్ములోని నియంత్రణ రేఖ- అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిర్మించిన 146 భూగర్భ బంకర్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. నిత్యం అలజడులు, ఉద్రిక్తతలతో సతమతమవుతున్న పూంచ్, రాజౌరీ తదితర ప్రాంతాల ప్రజలు ఈ బంకర్లను వినియోగించుకోనున్నారు.
మొత్తం 14వేల 460...

సరిహద్దు ప్రాంత ప్రజల భద్రతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2017లో 14వేల 460 బంకర్లను నిర్మించడానికి నిర్ణయించింది. వీటి నిర్మాణానికి 415.73 కోట్లను మంజూరు చేసింది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వద్ద నివసిస్తున్న వారి కోసం 7వేల 298 బంకర్ల నిర్మాణం జరగనుంది. జమ్ము, సంబ, కథువా జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజల కోసం 7 వేల 162 బంకర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చూడండి:- మ్యాచ్లో తేనెటీగలు.. ఇదే మొదటిసారి కాదు