తెలంగాణ

telangana

ETV Bharat / bharat

145 రోజులకు కార్గిల్​లో 'అంతర్జాలం'.. కశ్మీర్​లో ఎప్పుడు? - NATIONAL NEWS IN TELUGU

దాదాపు 145 రోజుల అనంతరం.. లద్ధాఖ్​లోని కార్గిల్​ జిల్లాలో మొబైల్​ ఇంటర్నెట్​ సేవల్ని పునరుద్ధరించారు. అయితే.. అధికరణ 370 రద్దు ముందు నుంచి అంతర్జాలానికి దూరంగా ఉన్న కశ్మీర్​లో ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇది అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఎందరో వ్యాపారవేత్తలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

145-days-of-internet-shutdown-in-kashmir-no-word-on-service-restoration
145 రోజులకు కార్గిల్​లో 'అంతర్జాలం'..కశ్మీర్​లో ఎప్పుడు?

By

Published : Dec 28, 2019, 5:37 AM IST

Updated : Dec 28, 2019, 6:01 AM IST

145 రోజులకు కార్గిల్​లో 'అంతర్జాలం'..కశ్మీర్​లో ఎప్పుడు?

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. రాష్ట్రంలో పలు నిషేధాజ్ఞలు విధించారు. ఇందులో భాగంగానే అంతర్జాల సేవల్నీ నిలిపేశారు. అయితే.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో జమ్మూ సహా పలు నగరాల్లో మొబైల్​ ఇంటర్నెట్​ సేవలు పునరుద్ధరించారు. తాజాగా లద్ధాఖ్​లోని కార్గిల్​ జిల్లాలోనూ దాదాపు 145 రోజుల అనంతరం.. అంతర్జాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఆర్టికల్​ 370 రద్దు నుంచి ఇంటర్నెట్​కు దూరంగా ఉన్న కశ్మీర్​లో మాత్రం ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.

ఇదీ చూడండి:145 రోజుల తరువాత మొబైల్​ ఇంటర్నెట్​ పునరుద్ధరణ

2019 ఆగస్టు 5న అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ విభజనపై కేంద్రం ప్రకటన చేసింది. రాష్ట్రంలో అప్పటి నుంచి ఇంటర్నెట్​ సేవలపై నిషేధం కొనసాగింది. క్రమక్రమంగా పలు ప్రాంతాల్లో ఆంక్షల ఎత్తివేసినా.. కశ్మీర్​కు మాత్రం ఇంకా ఆ మోక్షం కలగలేదు. 145 రోజులు దాటినా లోయలో అంతర్జాలం ఎప్పుడు పునరుద్ధరిస్తారో ఎలాంటి సంకేతాలివ్వట్లేదు. ఫలితంగా.. దాదాపు 5 నెలలుగా ఇంటర్నెట్​ సేవలకు దూరంగా ఉన్న విద్యార్థులు, వ్యాపార వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత డిజిటల్​ యుగంలో అంతర్జాల సేవలు లేకుండా పనులు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు చదువుకోవడానికి, దరఖాస్తులకు ఆన్​లైన్​ తప్పనిసరి. అక్కడక్కడా ప్రభుత్వం తాత్కాలిక అంతర్జాల కేంద్రాల్ని ఏర్పాటు చేసినప్పటికీ వేలాది మందికి ఏ మాత్రం సరిపోవట్లేదని ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

భద్రతా సమీక్ష తర్వాతే...

కార్గిల్​లో అంతర్జాల సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. క్రమంగా మిగతా ప్రాంతాలకూ పునరుద్ధరణ నిర్ణయాన్ని విస్తరించే అవకాశం ఉంది. అక్కడ బ్రాడ్​బ్యాండ్​ ఇంటర్నెట్​ సేవలు దశల వారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు భాజపా ప్రధాన కార్యదర్శి రాం మాధవ్​. కశ్మీర్​ వ్యాలీలో భద్రతను సమీక్షించిన అనంతరం.. అంతర్జాల సేవల పునరుద్ధరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

అధికరణ రద్దు నేపథ్యంలో వ్యాలీలో భారీగా మోహరించిన బలగాల్ని కూడా కేంద్రం క్రమంగా ఉపసంహరించుకుంటోంది.

ఇదీ చూడండి:కశ్మీర్​లో బలగాల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం

Last Updated : Dec 28, 2019, 6:01 AM IST

ABOUT THE AUTHOR

...view details