వలస వచ్చిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా మరణిస్తున్నారు. మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈ నెల మూడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 140 మంది మరణించారు. వీరిలో 42 మంది వలసకార్మికులేనని, ఇళ్లకు నడిచి లేదా ట్రక్కుల్లో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోయారని సేవ్ లైఫ్ ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది.
దారిలోనే పోతున్న 'వలస' ప్రాణాలు - వలస కార్మికులకు కరోనా కష్టాలు
కరోనా తెచ్చిన కష్టాలు వలస కార్మికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. లాక్డౌన్తో చేసేందుకు పనులు లేక సొంతూళ్లకు.. వెళ్లేందుకు నడుచుకుంటూ, ట్రక్కుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నాల్లో 142 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించించినట్లు ఓ నివేదిక తెలిపింది.
![దారిలోనే పోతున్న 'వలస' ప్రాణాలు migrant workers died in road accidents](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7106817-thumbnail-3x2-acc.jpg)
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్న వలస కార్మికులు
ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని, తాము కోరిన సమాచారాన్ని చాలా రాష్ట్రాలు వెల్లడించలేదని ఆ సంస్థ పేర్కొంది.
ఇదీ చూడండి:రోడ్లపైకి భారీగా వలస కూలీలు.. పోలీసుల లాఠీఛార్జ్