తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు "మరో చరిత్ర" సాధ్యమేనా..? - loksabha

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ పదిహేనేళ్లకు అధికారం సాధించింది. శాసనసభ ఎన్నికల్లో సఫలీకృతమైనా... లోక్​సభ స్థానాల్లో కొన్ని తీరని కోరికలు అలాగే ఉన్నాయి. రాష్ట్రంలోని 14 లోక్​సభ స్థానాల్లో పదిహేనేళ్లుగా గెలుపు అనేదే లేకుండా పోయింది హస్తానికి. ఈ ఎన్నికల్లోనైనా పరిస్థితి మారుతుందా?

కాంగ్రెస్ పరిస్థితి మారేనా

By

Published : Mar 26, 2019, 1:35 PM IST

మధ్యప్రదేశ్​లో లోక్​సభ ఎన్నికల చిత్రం
మధ్యప్రదేశ్​.... ఒకప్పుడు భాజపాకు కంచుకోట. వరుసగా 15ఏళ్లు ఆ పార్టీదే అధికారం. గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికలతో పరిస్థితి మారింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్​ అసెంబ్లీతో పోలిస్తే లోక్​సభ విషయంలో మరింత పేలవ రికార్డు కాంగ్రెస్ సొంతం. 14 స్థానాల్లో పదిహేనేళ్లుగా హస్తానికి గెలుపు అనేదే తెలియదు. సార్వత్రిక సమరంలో ఈ అడ్డంకిని దాటుకుని మధ్యప్రదేశ్​లో ఏకచ్ఛత్రాధిపత్యం సాధించగలదా?

రాష్ట్రంలో మొత్తం 29 లోక్​సభ స్థానాలు. గత ఎన్నికల్లో గుణ, ఛిండ్వారా మినహా 27 స్థానాలను ఊడ్చిపారేసింది భాజపా. గుణ, ఛిండ్వారాలో మాత్రం ఇప్పటివరకు కాషాయ జెండా ఎగరలేదు. కాంగ్రెస్ ప్రముఖులు కమల్​నాథ్​, జ్యోతిరాదిత్య సింధియా సొంత నియోజకవర్గాలు కావటం వల్ల అవి మిగిలాయి. కమల్​నాథ్ ఛిండ్వారాలో 1980 నుంచి పది సార్లు ఎంపీగా గెలిచారు. మధ్యలో ఒకసారి 1997 ఉపఎన్నికల్లో భాజపా నేత సుందర్​ లాల్​ పాత్వా గెలిచారు.

కమల్​నాథ్​ ఇప్పుడు ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం. ఛిండ్వారా లోక్​సభ నియోజకవర్గంలో ఆయన విజయపరంపరను కాంగ్రెస్​ కొనసాగించగలదా లేదా అన్నదే ప్రశ్న.

ఇవీ చూడండి:

2002 నుంచి వరుసగా 4 సార్లు గుణ ఎంపీగా గెలిచారు సింధియా. ఆయన్ను ఎదుర్కోవడం భాజపా ముందున్న సవాలు.

14 స్థానాలు.. 15 ఏళ్లు

భోపాల్, ఇండోర్​, విదిశ, మోరెనా, భిండ్, సాగర్, టికమ్​గఢ్​, దామో, ఖజురహో, సట్నా, జబల్​పూర్​, బాలాఘాట్​, బెటుల్​, రెవాలో 15 ఏళ్లలో ఒక్కసారైనా గెలవలేదు కాంగ్రెస్. రెవా మినహా అన్ని స్థానాల్లో భాజపా 15 ఏళ్లుగా ఓటమే ఎరుగదు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 9 స్థానాలు కమలదళానికి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్​ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

"మధ్యప్రదేశ్​లో మోదీ పట్ల వ్యతిరేకత పెరిగింది. అది మాకు ఎక్కువ స్థానాలు తీసుకొస్తుంది. ఆ దిశగానే మేము కృషి చేస్తున్నాం. భోపాల్, ఇండోర్, విదిశ స్థానాల్లో సీనియర్ నేతలను బరిలో దింపుతాం."
-పంకజ్ ఛతుర్వేది, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.... లోక్​సభ ఎన్నికల్లో క్లీన్​ స్వీప్​పై గురిపెట్టింది భాజపా. గుణ, ఛిండ్వారాలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details