కరోనా వైరస్ పరీక్షా సామగ్రి నాణ్యతను అంచనా వేసేందుకు ప్రైవేటు కంపెనీలకు కేంద్ర డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) లైసెన్స్‌లు ఇచ్చింది. తొలిదఫాలో 14 సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు సీడీఎస్సీఓ అధికారులు వెల్లడించారు. మరికొన్నింటికి లైసెన్స్‌లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
14 ప్రైవేటు కంపెనీల్లో 13 భారత్‌కు చెందినవి కాగా మరొకటి స్విస్ సంస్థ రోచె డయాగ్నోస్టిక్ ఇండియా. భారత్‌లోని వాటిలో అహ్మదాబాద్‌కు చెందిన కోసారా డయాగ్నోస్టిక్స్, చెన్నైకి చెందిన సీపీసీ డయాగ్నోస్టిక్స్లు ఉన్నాయి. ఈ సంస్థలు కొవిడ్-19 పరీక్ష సామగ్రి నాణ్యతను అంచనా వేసి డీసీజీఐకి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
"మరో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సంస్థ బయోమెరిక్స్కు లైసెన్స్ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నాం. ఈ సంస్థతో పాటు మరో మూడు సంస్థలు అనుమతులు కోరాయి."