తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులైలో భారీగా పెరిగిన ఉద్యోగాలు..!

జులై నెలలో ఉద్యోగాలు భారీగా పెరిగినట్లు... జాబితా విడుదల చేసింది జాతీయ గణాంకాల కార్యాలయం-ఎన్‌ఎస్‌ఓ. గత నెల కంటే ఈ నెలలో  ఉద్యోగం పొందిన వారు అధిక సంఖ్యలో  ఉన్నట్లు తెలిపింది.

అధిక సంఖ్యలో ఉద్యోగాల రూపకల్పన-వెల్లడించిన గణాంకాలు

By

Published : Sep 25, 2019, 11:47 PM IST

Updated : Oct 2, 2019, 1:07 AM IST

జులై నెలలో 14 లక్షల 24 వేల ఉద్యోగాల కల్పన జరిగినట్లు ఉద్యోగుల బీమా సంస్థ-ఈఎస్​ఐసీ విడుదల చేసిన పేరోల్ డేటాలో వెల్లడైంది. జూన్‌లో 12 లక్షల 49వేల మంది ఉద్యోగాలు పొందగా ఈ సంఖ్య జులైలో అధికంగా ఉన్నట్లు డేటా తెలిపింది. 2018-19లో కోటీ 49 లక్షల మంది కొత్తగా ఈఎస్​ఐసీ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నమోదు చేసుకున్నట్లు.... జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్​ఎస్​ఓ నివేదికలో తెలిపింది.

ఈఎస్​ఐసీతో పాటు, భవిష్య నిధి సంస్థ-ఈపీఎఫ్​ఓ, పింఛను నిధుల నియంత్రణ, అభివృద్ధి సంస్థ-పీఎఫ్​డీఆర్​ఏ నడిపే వివిధ భద్రత పథకాలలో కొత్తగా చేరేవారి పేరోల్ డేటా ఆధారంగా ఎన్​ఎస్​ఓ నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదిక ప్రకారం..... 2017 నుంచి జులై 2019 వరకు 2 కోట్ల 83 వేల మంది ఈఎస్​ఐ పథకంలో కొత్తగా చేరారు. జూన్‌లో 10 లక్షల 75వేల మంది కొత్తగా ఈపీఎఫ్​ఓ కోసం నమోదు చేసుకోగా జులైలో వీరిసంఖ్య 11 లక్షల 61వేలుగా ఉంది. 2018-19లో 61 లక్షల 12 వేలమంది కొత్త సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ నడిపే సామాజిక భద్రత పథకాలలో చేరారు.

ఇదీ చూడండి : ఓ చైనీస్​ కుటుంబ కథ: ఫ్రీ ఫ్లాట్​ కోసం 23 సార్లు పెళ్లిళ్లు

Last Updated : Oct 2, 2019, 1:07 AM IST

ABOUT THE AUTHOR

...view details