ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై దిల్లీ నుంచి మోతీహరి వెళ్తున్న ప్రైవేటు బస్సు... ఓ ట్రక్కును వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 14కు చేరిన మృతులు - ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రైవేటు బస్సు ఓ ట్రక్కును వెనక నుంచి ఢీ కొట్టిన ఈ ఘటనలో 31 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం
క్షతగాత్రులను ఇటావా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40-45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయ చర్యలకు అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Last Updated : Mar 1, 2020, 4:27 AM IST