కరోనా మహమ్మారి మహారాష్ట్రలోని నాగ్‌పుర్ కేంద్ర కారాగారాన్ని గడగడలాడిస్తోంది. తాజాగా అక్కడ 132 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీనితో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన ఖైదీల సంఖ్య 219కి చేరింది.
"యాంటిజెన్ పరీక్షల్లో 132 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వారిని కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం."
- అనూప్ కుమ్రే, జైలు సూపరింటెండెంట్