కేరళ ఇడుక్కిలో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ తండ్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో కామాంధుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇడుక్కి జిల్లా శాంతపరా పరిధిలోని రాజకుమారి ఖాజనప్పరాకు చెందిన 13 ఏళ్ల బాలిక, శారీరకంగా చిత్రహింసలకు గురైంది. వేదన తాళలేక గాయాలతో ఓ ఆసుపత్రిలో చేరింది. తన మూడోతండ్రి ఏడాదిపాటుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని. ఖాజనప్పరాకు చెందిన నాగరాజన్(45) అనే మరో వ్యక్తి లైంగికంగా వేధించాడని వైద్యులతో చెప్పుకుంది. ఆసుపత్రి నిర్వాహకుల సమాచారం మేరకు, శాంతనపరా పోలీసులు రంగంలోకి దిగారు.