తెలంగాణ

telangana

ETV Bharat / bharat

13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం - మధ్యప్రదేశ్ ఉమరియా లైంగిక దాడి

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 9 మంది దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను రెండుసార్లు ఎత్తుకెళ్లి లైంగికదాడి చేశారు. నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

MP Gang rape
13ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

By

Published : Jan 17, 2021, 5:34 PM IST

మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో 13 ఏళ్ల బాలికపై 9 మంది మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 4, 11వ తేదీల్లో చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

జనవరి 4న మార్కెట్‌లో ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లిన కామోన్మాదులు.. సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నారిని బెదిరించి మరుసటి రోజు ఇంటికి పంపించారు. 11వ తేదీన మళ్లీ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 376, 366 A, పోక్సో చట్టం కింద.. కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఏకాంత చిత్రాలు.. వీడియోలతో భర్త వేధింపులు

ABOUT THE AUTHOR

...view details