ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న 13 మందిని గుర్తించిన ఎన్ఐఏ పుల్వామా దాడి అనంతరం ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా అన్ని దారులను అన్వేషిస్తోంది. వారికి సాయం అందిస్తున్నట్లు 13 మందిని గుర్తించాయి భద్రతా సంస్థలు. అందులో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్, హురియత్ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. దేశ వ్యతిరేక చర్యలు, విధ్వంసాలు సృష్టించటం, రాళ్ల దాడులు వంటివి చేయటానికి స్థానిక యువతను ప్రేరేపిస్తున్నారు ఉగ్రవాదులు. యువతను తప్పుదోవ పట్టించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
మొదటి చర్యల్లో భాగంగా గురుగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ షా వతాలి భవనాన్ని జప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి డబ్బులు పొందిన ఆరోపణలతో ప్రస్తుతం జహూర్ తిహార్ జైలులో ఉన్నాడు.
జాబితాలో ఉన్న పేర్లు
మోహద్ యుసఫ్ షా అలియాస్ సయ్యద్ సలాహుద్దీన్ (హిజ్బుల్), హఫీజ్ సయీద్ ( జమాత్ ఉల్ దావా), అఫ్తాబ్ అహ్మద్ షా అలియాస్ ఫంతూశ్ ( తహ్రీక్ ఈ హూరియత్), సయ్యద్ గిలాని, మహమ్మద్ నయీమ్ ఖాన్, ఫరూఖ్ అహ్మద్ దార్, అక్బర్ ఖండేయ, మెహ్రజూద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, సైఫుల్లా, నవాల్ కిశోర్ కపూర్, జహూర్ అహ్మద్ షా