మహారాష్ట్రలోని ముంబయి పోలీసు విభాగంలో కరోనా కలకలం రేగింది. ఓ ఐపీఎస్ అధికారి సహా.. మొత్తం 13 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ వార్తతో నగర పోలీసు శాఖ అప్రమత్తమైంది. అందరినీ ఐసోలేషన్‌కు తరలించింది.
వివరాల ప్రకారం.. ఆ ఐపీఎస్ అధికారి డ్రైవర్ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ముందు జాగ్రత్తగా తన కూడా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. మరో 12 మంది పోలీసు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం.. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో 48 మందిని క్వారంటైన్ చేశారు. మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు.