దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు, యజమాని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రికి చేర్పించగా.. ఐదుగురు మృతి చెందారు. మరో 8 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఘటనలో మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గల్లంతైంది. వీరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి - దిల్లీలో కుప్పకూలిన భవనం
దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి యజమాని సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
![కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి building collapses in Delhi's Bhajanpura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5839600-thumbnail-3x2-building.jpg)
కుప్పకూలిన భవనం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు
కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి
"ఇవాళ సాయంత్రం 4.30 గంటల సమయంలో భవనం కుప్పకూలింది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు."
- అతుల్ గార్గ్, దిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్
ఇదీ చూడండి: లైవ్ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె!
Last Updated : Feb 18, 2020, 9:38 AM IST