మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు - కరోనా మరణాలు
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 3,827 కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడులో కూడా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఇవాళ 2,115 కేసులు, 41 మరణాలు సంభవించాయి.
భారత్లో కరోనా మరణాలు
By
Published : Jun 19, 2020, 11:22 PM IST
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 3,80,532, మరణాల సంఖ్య 12,573కు చేరింది. మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 3,827 పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,24,331కి, మృతుల సంఖ్య 5,893కి పెరిగింది.
తమిళనాడులో శుక్రవారం 2,115 కేసులు, 41 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసులు 54,449, మరణాలు 666కి పెరిగాయి.
గుజరాత్లో కొత్తగా 540 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 26,198కి చేరింది. మరోవైపు 27 మంది మహమ్మారి బారినపడి మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,619కి పెరిగింది.