తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మూడున్నర అడుగుల మహిళ - 121cm lady delivered a baby in gangavathi government hospital

కర్ణాటకలో సుమారు మూడున్నర అడుగుల ఎత్తున్న ఓ మరుగుజ్జు మహిళ పండంటి ఆడ శిశివుకు జన్మనిచ్చింది. అయితే.. సరైన ఎత్తు లేకపోవటం వల్ల డెలివరీ సమయంలో సమస్య తలెత్తింది. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేసేందుకు నిరాకరిస్తే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి బిడ్డకు ప్రాణం పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

121-centimeter dwarf woman was given birth to a baby by cesarean
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మూడున్నర అడుగల మహిళ

By

Published : Jan 25, 2020, 12:03 PM IST

Updated : Feb 18, 2020, 8:37 AM IST

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మూడున్నర అడుగుల మహిళ

కర్ణాటక కొప్పాల్​లో​ ఓ అరుదైన ఘటన జరిగింది. కేవలం మూడున్నర అడుగులు(121 సెంటిమీటర్ల) పొడవున్న ఓ మరుగుజ్జు మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

బాసుపురకు చెందిన నేత్రావతి అనే మహిళ సుమారు మూడున్నర అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. జన్యు లోపాల వల్ల శారీరకంగా ఎదగలేకపోయింది. అయితే ఇటీవలే వివాహం చేసుకున్న నేత్రావతి గర్భం దాల్చింది. నెలలు నిండి పురిటి నొప్పులతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళితే డెలివరీ చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. సరైన ఎత్తు లేకపోవటం వల్ల తల్లీబిడ్డకు ప్రమాదం అని తేల్చేశారు. నగరంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తిరిగింది నేత్రావతి. కానీ, ఎవరూ ఆమెకు వైద్యం అందించలేదు.
చివరకు.. గంగావతిలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నేత్రావతికి భరోసా ఇచ్చారు. ఆమె సమస్యను సవాలుగా స్వీకరించారు. శస్త్ర చికిత్స చేసి మరుగుజ్జు మహిళకు అమ్మతనాన్ని అందించారు.

ప్రస్తుతం మాతా-శిశువులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు వైద్యులు.

ఇదీ చదవండి:నితిన్​ గడ్కరీ బౌలింగ్​లో.. హార్దిక్​ పాండ్య సిక్సర్​

Last Updated : Feb 18, 2020, 8:37 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details