తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​పై కజిన్స్ అత్యాచారం- బాలికకు 4 నెలల గర్భం - 12-year-old girl raped by her three minor cousins over a period of five months

దేశంలో వరుస అత్యాచారాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్​లో తాజాగా మరో రెండు అత్యాచార ఘటనలు బయటపడ్డాయి. బాధితురాళ్లు ఇద్దరు మైనర్లేనని పోలీసులు తెలిపారు. ఓ ఘటనలో మైనర్లే అఘాయిత్యానికి ఒడిగట్టగా.. మరో ఘటనలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కిరాతకుడు.

Gujarat: 12-year-old girl pregnant after rape by minor cousins
మైనర్​ అత్యాచారం

By

Published : Oct 10, 2020, 9:48 AM IST

గుజరాత్​ నవ్సారీ జిల్లాలో రెండు అత్యాచార కేసులు నమోదయ్యాయి. మొదటి ఘటనలో పన్నెండేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలికి వీరంతా కజిన్స్. వీరు ఐదు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చే సరికి బాలిక నాలుగు నెలల గర్భవతిగా తేలిందని నవ్సారీ జిల్లా డీఎస్పీ బీఎస్ మోరి తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

"బాలికపై తన కజిన్స్​లో ఒకరు అత్యాచారం చేశాడు. నిందితుడు ఈ విషయాన్ని మరో ఇద్దరు కజిన్స్​కు చెప్పాడు. వీరంతా కలిసి బాధితురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులందరి వయసు 18 ఏళ్ల లోపే. బాలికకు కడుపు నొప్పి రావడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత బాలిక.. అత్యాచార విషయాన్ని తన తల్లికి చెప్పింది."

-బీఎస్ మోరి, నవ్సారీ డీఎస్పీ

మరో ఘటనలో 13 ఏళ్ల బాలికపై సోదరుడి స్నేహితుడు అక్టోబర్ 3న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో నిందితుడు అప్​లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని రికార్డు చేసినట్లు వెల్లడించారు.

"అక్టోబర్ 3న నిందితుడు బాలికను బైక్​పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. బాలిక ఫొటోలను ఓ బంధువు గుర్తించగా విషయం బయటపడింది."

-బీఎస్ మోరి, నవ్సారీ డీఎస్పీ

నిందితుడిని అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 376, పోక్సో, ఐటీ చట్టం సెక్షన్ 66(ఈ) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మోరి తెలిపారు.

ఇదీ చదవండి-కదులుతున్న కారులో అత్యాచారం- ఆపై బయటికి తోసేసి..

ABOUT THE AUTHOR

...view details