తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా - దిల్లీ

దిల్లీలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. పాత దిల్లీలోని ఓ కంటైన్మెంట్​ ప్రాంతంలో 2 నెలల చిన్నారి సహా కుటుంబంలోని 12 మందికి వైరస్​ సోకింది. దేశ రాజధానిలో ఇప్పటివరకు 2376 మంది కరోనా బారినపడగా.. 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

12 of family, including 2-month-old infant test positive
ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

By

Published : Apr 24, 2020, 7:41 AM IST

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. దిల్లీలో వైరస్​ విస్తృతి దృష్ట్యా పలు ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి.. ఇళ్లలోంచి ప్రజలను బయటకు రానివ్వడం లేదు. అయినప్పటికీ వైరస్​ విజృంభిస్తూనే ఉంది.

పాత దిల్లీలోని ఓ కంటైన్మెంట్​ జోన్​లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2 నెలల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. వీరందరినీ ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రికి పంపించినట్లు వెల్లడించారు.

నిర్లక్ష్యంతోనే..

గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉజ్బెకిస్థాన్​ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే.. అధికారులకు సమాచారం అందించలేదు. అనంతరం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా పాజిటివ్​గా తేలింది. ఛురివలన్​లో నివాసం ఉండే ఈ వ్యక్తి కుటుంబంలోని మిగతా 11 మందికీ తర్వాత కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

వీరికి కరోనా ఉన్నట్లు తేలిన అనంతరం.. ఈ కంటైన్మెంట్​ జోన్​లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను మరింత కఠినతరం​ చేశారు.

దిల్లీ జహంగీర్​పురీ ప్రాంతంలో ఇటీవల ఒకే కుటుంబంలోని 31 మందికి కరోనా సోకింది. ఇందులోనూ చిన్నపిల్లలున్నారు.

దేశరాజధానిలో మొత్తం కరోనా కేసులు 2376కు చేరగా.. ఇప్పటివరకు 50 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details