తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు మరోసారి రైతులు- కేంద్రం మధ్య చర్చలు - రైతులు- కేంద్రం మధ్య చర్చలు

ప్రభుత్వానికి కర్షకసంఘాలకు మధ్య నేడు 11వ విడత చర్చలు జరగనున్నాయి. అయితే కొత్త సాగు చట్టాలను 18 నెలల పాటు అమలు చేయకుండా నిలిపి ఉంచుతామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాల రద్దు తప్ప తమకు ఇక ఏదీ సమ్మతం కాదని తేల్చి చెప్పాయి..

farmers
నేడు మరోసారి రైతులు- కేంద్రం మధ్య చర్చలు

By

Published : Jan 22, 2021, 5:15 AM IST

సాగుచట్టాలపై ఉద్ధృతంగా పోరు సాగిస్తున్నారు రైతులు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రభుత్వానికి- రైతులకు మధ్య 11వ విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అనుసరించాల్సిన విధానంపై కేంద్ర హో మంత్రి అమిత్‌షాతో వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ చర్చించారు.

కుదరదు..

కొత్తసాగు చట్టాల విషయంలో ఓ పరిష్కారం లభించే వరకు వాటి అమలును ఏడాది లేదా ఏడాదిన్నర పాటు నిలిపేస్తామని..అప్పటి వరకూ ఉద్యమాన్ని నిలుపుదల చేయాలంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. బుధవారం జరిగిన 10వ విడత చర్చల్లో కేంద్రం ఈ ప్రతిపాదనను రైతు సంఘాల ఎదుట ఉంచగా దానిపై గురువారం రోజు సంయుక్త కిసాన్ మోర్చా పూర్తిస్థాయిలో సాధారణ సమావేశాన్ని నిర్వహించి చర్చించింది. దాదాపు 4 గంటలపాటు చర్చించిన రైతు నేతలు కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించాలని తీర్మానించారు. సాగు చట్టాలను.. రద్దు చేయాల్సిందేనని మద్దతుధరకు చట్టం చేయడం సహా పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్‌లను నెరవేర్చాల్సిందేనని రైతులు నిన్న స్పష్టం చేశారు. చట్టాల రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే వరకు ఉద్యమాన్ని వదిలి ఇళ్లకు వెళ్లేది కూడా లేదని రైతులు తేల్చి చెప్పారు.

143 మంది మృతి..

ఈ ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన.. 143 మంది అన్నదాతలకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు.. వారు తమతో లేకున్నా వారు నింపిన స్ఫూర్తి తమతోనే ఉందని.. వారి ఆశయాన్ని సాధించి తీరుతామని రైతులు పేర్కొన్నారు.

ట్రాక్టర్​ ర్యాలీపై..

నిన్న రైతు సంఘాలతో పోలీసులు కూడా చర్చలు జరిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ బాహ్యవలయ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ చేస్తామన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులను పోలీసులు కోరారు. అయితే పోలీసులు కోరిన విధంగా దిల్లీ బయట ర్యాలీ చేసేందుకు తాము సిద్ధంగా లేమని..ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న చోటనే ర్యాలీ నిర్వహించి తీరుతామని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. రైతులతో చర్చలో కుండ్లి-మానేసర్‌-పాల్పాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ర్యాలీ చేసుకోవాలని పోలీసులు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ రైతులు మాత్రం అందుకు సంసిద్ధత తెలపలేదు.

కమిటీ..

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నిన్న తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా 8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వర్చువల్‌గా సమావేశమై సాగు చట్టాలపై వారి అభిప్రాయాలను సేకరించింది.

ABOUT THE AUTHOR

...view details