కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిరోజులుగా జపాన్ నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ షిప్‌లోని భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ద్వారా.. ఇవాళ ఉదయం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. 119 మంది భారతీయులతో పాటు శ్రీలంక, నేపాల్, సౌతాఫ్రికా, పెరూలకు చెందిన మరో ఐదుగురిని తీసుకొచ్చిందీ విమానం.
తరలింపునకు ఏర్పాట్లు చేసిన జపాన్ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు విదేశాంగ మంత్రి జయ్శంకర్.
''టోక్యో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం దిల్లీలో ఇప్పుడే ల్యాండయింది. కొవిడ్-19 వైరస్ వ్యాప్తితో జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌక నిర్బంధంలో ఉన్న 119 మంది భారతీయులు సహా శ్రీలంక, నేపాల్, సౌతాఫ్రికా, పెరూలకు చెందిన ఐదుగురు పౌరులను భారత్‌కు చేర్చిన జపాన్ అధికారులకు కృతజ్ఞతలు.''