తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్జీపై 11 ఏళ్ల కుర్రాడి పోరాటం - అహద్​ నిజాం

ప్రమాదకర అంతర్జాల క్రీడ పబ్జీపై ముంబయికి చెందిన 11 ఏళ్ల కుర్రాడు అహద్​ నిజాం పోరాటం చేస్తున్నాడు. పబ్జీని నిషేధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.

333

By

Published : Feb 1, 2019, 7:44 AM IST

77
ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందిన ప్రమాదకరమైన మొబైల్​ క్రీడ పబ్జీ ( ప్లేయర్​ అనౌన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​) పై 11 ఏళ్ల కుర్రాడు కోర్టును ఆశ్రయించాడు. పబ్జీని నిషేధించాలని కోరుతూ అహద్​ నిజాం అనే బాలుడు తన తల్లి సహాయంతో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ క్రీడ హింస, దురాక్రమణ, సైబర్​ బెదిరింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాడు.

పిల్​లో పేర్కొన్న విధంగా పబ్జీని నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​హెచ్​ పాటిల్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఆన్​లైన్​ ఎథిక్స్​ రివ్యూ కమిటీ నియామకానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్​లో కోరినట్లు న్యాయవాది తన్వీర్​ నిజాం తెలిపారు.

పబ్జీ ( ప్లేయర్​ అనౌన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​) అనేది అంతర్జాల క్రీడ. యుద్ధభూమి నేపథ్యంలో ఇద్దరు లేక ముగ్గురు అంతర్జాల భాగస్వాములు ఆడటానికి వీలుంటుంది. యాధృచ్ఛికంగా కొంత కాలం క్రితం పరీక్షల ఒత్తిడిపై విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఈ పబ్జీ ఆట గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details