భారతదేశం భూతలస్వర్గమని ఎందరో కవులు వర్ణించారు. ప్రపంచంలో పేరుగాంచిన అందాలను తలదన్నేలా మన మాతృభూమిలో కొన్ని ప్రదేశాలు, కట్టడాలు, ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మితీరాలి. దేశదేశాలు తిరిగేయాలని కలలు కనే యాత్రికులు... దేశంలోని ఈ ప్రదేశాలు చూస్తే ప్రపంచాన్ని చుట్టేసినట్టే.
కరోనా కారణంగా విదేశాలు వెళ్లడం ఇప్పట్లో కష్టమే. ఒకవేళ దేశంలో పర్యటించే అవకాశం వస్తే ఇవన్నీ చూసేయండి. ఎందుకంటే ఈ 11 ప్రదేశాలు అచ్చం విదేశాల్లోని ప్రముఖ ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోవు. ఇంతకీ అవి ఏంటో తెలుసుకుందామా!
అలప్పుజ-వెనిస్
వెనిస్‌లో పడవ షికారుకు వెళ్లాలనుకునే ముందు ఒకసారి కేరళలోని అలప్పుజకు వెళ్లండి. అక్కడ బ్యాక్ వాటర్‌లో.. హౌస్‌బోట్‌లో షికారు చేస్తుంటే ఎవరైనా ప్రకృతికి దాసోహమైపోతారు. వెనిస్‌కు ఏ మాత్రం తీసిపోని అలెప్పీ అందాలకు పర్యటకులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. అందుకే అలప్పుజను 'వెనిస్ ఆఫ్ ద ఈస్ట్'గా పిలుస్తారు.
రణ్ ఆఫ్ కచ్- సాల్ట్ లాండ్స్ ఆఫ్ ఉటా
సాల్ట్ లాండ్స్ చూడటం కోసం ఉటా వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌కు వెళ్లండి. ఈ రెండు ప్రదేశాల్లో మీరు ఒకే తరహా అనుభూతి పొందుతారు. చలికాలంలో దీని అందం రెట్టింపు అవుతుంది. ఈ ప్రాంతానికి నవంబర్ రెండో వారం నుంచి ఫిబ్రవరి వరకు యాత్రికుల తాకిడి ఎక్కువ.
రణ్ ఆఫ్ కచ్- సాల్ట్ లాండ్స్ ఆఫ్ ఉటా గండికోట ఫోర్ట్- గ్రాండ్ కెనాన్
యునైటెడ్ స్టేట్స్‌లోని గ్రాండ్ కెనాన్‌కు దీటుగా భారత్‌లో గండి కోట ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న గండి కోటను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎంతో పురాతనమైన గండికోట నేటికీ చెక్కు చెదరకుండా యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. దీనిని పశ్చిమ కల్యాణీ చాళుక్య రాజైన అహవమల్ల సోమేశ్వరుని సంరక్షకుడు కాకరాజు కట్టించాడని ప్రతీతి. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన లోయలో పెన్నానది వంపు తిరుగుతుంది.
గండికోట ఫోర్ట్- గ్రాండ్ కెనాన్ హిమాచల్ ప్రదేశ్- స్విట్జర్లాండ్
మంచుతో కప్పేసిన కొండలు.. ఎటు చూసినా పచ్చిక... ఇలాంటి అనుభూతి కోసం.. చాలామంది స్విట్జర్లాండ్‌కు వెళ్తుంటారు. అక్కడివరకు వెళ్లకుండా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లండి చాలు. అలాంటి ఫీలింగే మీకూ కలుగుతుంది. ఖర్చుతో పాటు సమయం కూడా కలిసొస్తుంది.
హిమాచల్ ప్రదేశ్- స్విట్జర్లాండ్ ఉత్తరాఖండ్ - యాంటెలోప్ లోయ
ఉత్తరాఖండ్‌లో అందమైన పూల లోయలను చూస్తే.. యునైటెడ్ స్టేట్స్‌లోని యాంటెలోప్ లోయను చూసిన అనుభూతి పొందుతారు. ఉత్తరాఖండ్‌లోని పూల లోయలను చిత్రాల్లో బంధిస్తే యాంటెలోప్ లోయకు ఏ మాత్రం తీసిపోదు. దేవకన్యలు ఇక్కడికి వచ్చే వారని, ప్రకృతి ఈ పూల స్వర్గానికి తోటమాలని ప్రతీతి.
ఉత్తరాఖండ్ - యాంటెలోప్ లోయ మున్నార్- కామెరాన్
కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్‌లోని తేయాకు తోటల అందాలు మీ హృదయాన్ని తాకుతాయి. మరోవైపు మలేసియాలోని కామెరాన్‌లో ఉన్న పొలాలను చూస్తే రెండూ ఒకటేనా అని ఆశ్చర్యపోతారు. మున్నార్‌లో ఫొటో పాయింట్, ఎకో పాయింట్, ఏనుగుల ప్రదేశం, ఎరావికులం నేషనల్ పార్కు ప్రసిద్ధి. దీనిని 'క్వీన్ ఆఫ్ గాడ్స్ ఓన్ ల్యాండ్'గా పిలుస్తారు.
పుదుచ్చేరి- వియత్నాం
పుదుచ్చేరి వెళ్లి సూర్యాస్తయం చూస్తూ ఫొటోలు తీసుకోండి. తిరిగి ఇంటికి వచ్చాక మీ మిత్రులతో వియత్నాంలోని ఫ్రెంచ్ కాలనీ దగ్గరి ఫొటోలు అంటే వాళ్లు నమ్మేస్తారు. ఎందుకంటే ఆ రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి. పుదుచ్చేరి వెళ్తే ఫ్రెంచ్ కాలనీలో ఉన్న అనుభూతినే పొందుతారు. ఫ్రెంచ్ సౌందర్యం కలిగి ఉన్న మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, చున్నంబార్ బోట్ హౌస్ పుదుచ్చేరిలో ప్రసిద్ధి.
అతిరాపల్లి - నయాగరా
కేరళలోని అతిరాపల్లి జలపాతాన్ని భారత నయాగరా జలపాతంగా పిలుస్తారు. అమెరికాలో ఉన్న నయాగరా జలపాతం అందాలకు తగ్గకుండా అతిరాపల్లి జలపాతం ఉంటుంది. భారత చలనచిత్ర చరిత్రలో ప్రసిద్ధిగాంచిన బాహుబలి సినిమాలో జలపాత సన్నివేశాన్ని అతిరాపల్లి, వాజాచల్ జలపాతాల వద్దే తీశారు.
థార్ - సహారా
ఆఫ్రికాలోని సహారా ఎడారికి వెళ్లాలనుకునే ప్రకృతి ప్రేమికులు... రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కాలు మోపండి చాలు. అక్కడి ఇసుక తిన్నెల అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్రేట్ ఇండియన్ డిజర్ట్‌గా పిలుచుకునే థార్ ఎడారిలో పర్యటక అందాలకు కొదువలేదు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య అసలు పోలికే ఉండకపోవడం ఈ ఎడారికి ఉన్న మరో ప్రత్యేకత.
నైనిటాల్ - లేక్ డిస్ట్రిక్
ఇంగ్లండ్‌లోని లేక్ డిస్ట్రిక్ హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంటుంది. దాని రీతిలోనే నైనిటాల్ అందాలు దాగి ఉన్నాయి. నైనిటాల్ కొండలు, లోయల సోయగాలను చూడాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందే. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలుచుకునే నైనిటాల్ గురించి స్కందపురాణంలో కూడా పేర్కొన్నారు. దీంతో పాటు దేశంలోని 51 శక్తి పీఠాల్లోని ఒకటైన 'నైనా దేవి' ఇక్కడే కొలువుతీరింది.
నైనిటాల్ - లేక్ డిస్ట్రిక్ అండమాన్ నికోబార్ దీవులు - మాల్దీవులు, మడగాస్కర్
తీవ్రమైన ఒత్తిడి నుంచి విరామం కోసం సముద్ర తీరాలకు ఎక్కువగా వెళ్తుంటారు. సెలవుల్లో ఉత్తమ బీచ్ కోసం వెతికితే మాల్దీవులు, మడగాస్కర్ అని చూపిస్తుంటాయి. అలాంటివే భారత్‌లో ఉంటే అక్కడి వరకు ఎందుకు వెళ్లడం? అవును నిజమే! మాల్దీవులు, మడగాస్కర్ మించిన అందాలు అండమాన్ నికోబార్ దీవుల్లో దాగున్నాయి.
అండమాన్ నికోబార్ దీవులు - మాల్దీవులు, మడగాస్కర్