పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. లోక్‌సభలో నిన్న అర్ధరాత్రి.. ఈ వివాదాస్పద బిల్లును ఆమోదించటాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా.. అసోంలో బంద్ పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారాయి.
నార్త్ ఈస్ట్ స్టూడెంట్ యూనియన్(ఎన్ఈఎస్ఓ) 11 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగనుంది.
'ఎన్ఈఎస్ఓ'తో పాటు బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, ఏఐఎస్ఎఫ్ సహా మొత్తం 16 సంఘాలు 12 గంటల బంద్ పాటిస్తున్నాయి. వీటికి పలు రాజకీయ పార్టీల మద్దతూ లభిస్తోంది. పలు చోట్ల రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసనలు తెలియజేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు తెరుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.