కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో 11 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అదే కార్యాలయంలో పనిచేస్తోన్న ఇద్దరికి గత వారమే వైరస్ సోకింది. ఫలితంగా రెండు రోజుల పాటు కార్యాలయాలన్ని మూసివేసిన అధికారులు.. శానిటైజింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆ 11 మంది వీరే..
ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. మరో 11 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కొవిడ్-19 సోకిన వారిలో సంయుక్త కార్యదర్శి, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, మరో ప్రైవేట్ సెక్రటరీలతో సహా.. ఆరుగురు మల్టీటాస్కింగ్ అసిస్టెంట్లు, ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కార్యాలయంలో శానిటైజింగ్ పనులు పూర్తయినందున రేపటి నుంచి కార్యాలయాన్ని తెరిచేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇంతలోనే ఇలా కరోనా కేసులు బయటపడటం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులే