దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో చెలరేగిన హింస కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఘర్షణలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై ప్రకటన విడుదల చేశారు దిల్లీ పోలీసులు. 106మందిని అరెస్టు చేసినట్లు, 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
"బుధవారం ఎలాంటి ఘర్షణ చెలరేగలేదు. ఈశాన్య దిల్లీ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులు తగ్గాయి."