పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని కేరళలోని కొల్లాం జిల్లాకు చేందిన 105 ఏళ్ల భాగీరథి అమ్మ మరోమారు నిరూపించారు. నాలుగో తరగతి పరీక్షల్లో ఈ వృద్ధురాలు 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో 275 మార్కులకు గాను 205 మార్కులు పొందినట్టు కేరళ అక్షరాస్యత మిషన్ (కేఎస్ఎల్ఎం) ప్రకటించిన ఫలితాల్లో తేలింది.
105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పాస్! - 105 ఏళ్ల బామ్మ
కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 105 ఏళ్ల భాగీరథి అమ్మ నాలుగో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 74.5 శాతం మార్కులు తెచ్చుకున్న భాగీరథి.. గణితంలో 75కు గాను 75 మార్కులు సాధించారు.
105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పాస్!
భాగీరథి అమ్మకు గణితంలో 75కు 75 మార్కులు, ఆంగ్లంలో 50కి 30 మార్కులు వచ్చాయి. ఆరోగ్యం సహకరిస్తే ఐదో తరగతి కూడా చదువుతానని ధీమాగా చెబుతున్నారు భాగీరథి.
ఇదీ చూడండి: 200 అడుగుల హైవోల్టేజ్ టవర్పైనుంచి జంప్!
Last Updated : Feb 29, 2020, 9:11 AM IST